ఇండియాలో రజినీదే భారీ రెమ్యునరేషన్ అంటూ లేటెస్ట్ టాక్.!

Published on Jun 24, 2022 12:10 pm IST


ఇండియన్ సినిమా దగ్గర సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న క్రేజ్ ఏపాటిదో అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు రజిని అయితే తన రేంజ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. తన గత సినిమా “పెద్దన్న” తమిళ్ లో హిట్ అయ్యినప్పటికీ మన తెలుగులో మాత్రం సినిమా రొటీన్ ఎమోషన్స్ వల్ల పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీనితో రజిని మార్క్ మాస్ కం బ్యాక్ ని మన దగ్గర కూడా ఆశిస్తున్నా ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు.

ఇదిలా ఉండగా గత రెండు మూడు రోజులు నుంచి హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోలపై టాక్ నడుస్తుండగా కోలీవుడ్ వర్గాల వారు అయితే రజినీదే ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటూ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. వారు చెప్తున్నా దాని ప్రకారం అయితే రజిని ఇప్పుడు “జైలర్” చిత్రం కోసం ఏకంగా 140 కోట్లకి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని అంటున్నారు. మరి వీటిలో ఎంతవరకు నిజముందో అనేది వాళ్ళకే తెలియాలి.

సంబంధిత సమాచారం :