“కేజీయఫ్ 2” రిలీజ్ పై సరికొత్త టాక్స్.!

Published on Jun 18, 2021 3:05 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ యాక్షన్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ సినిమాగా నిలిచింది. అయితే ఎప్పుడో పూర్తి కాబడిన ఈ భారీ చిత్రం విడుదల కోసం కొన్నాళ్లుగా ఆసక్తికర టాక్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

ఈ చిత్రం అనుకున్న సమయానికే జూలై 16 నే విడుదల అవుతుంది అని అలాగే అక్టోబర్ కి పోస్ట్ పోన్ అయ్యిందని మరోపక్క సరికొత్త విడుదల తేదీని ఈ సినిమా అసలు విడుదల తేదీ జూలై 16న ప్రకటిస్తారని అనేక రకాల ఊహాగానాలు వినిపించసాగాయి. మరి ఇప్పుడు ఎట్టకేలకు ఈ చిత్రం సెప్టెంబర్ రిలీజ్ కానుంది అని సరికొత్త టాక్ మొదలయ్యింది. ఇలా ఈ భారీ చిత్రంపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరి మేకర్స్ ఫైనల్ గా ఈ చిత్రాన్ని ఎప్పటికి ప్లాన్ చేస్తున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం :