లేటెస్ట్..తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్.!

Published on Apr 23, 2021 10:00 am IST

మళ్ళీ కరోనా విజృంభణ దేశ వ్యాప్తంగా ఏ స్థాయిలో ఉందో మనకి తెలిసిందే. ఈ రెండో వేవ్ దెబ్బకు ప్రపంచంలోనే అత్యధిక కేసులు ఇపుడు దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్నాయి. దీనితో అనేకమంది సినీ ప్రముఖులు సహా రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం కరోనా బారిన పడుతున్నారు.

ఇటీవలే తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు కెసిఆర్ తనయుడు అక్కడి ఐటీ శాఖ మరియు పట్టణాభివృద్ధి మంత్రి కల్వకుంట్ల రామారావు కూడా తనకి పాజిటివ్ వచ్చినట్టు తెలియజేసారు. స్వల్ప కరోనా లక్షణాలు ఉంటే తాను టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని తెలియజేసారు.

అలాగే రీసెంట్ గా తనని ఎవరైతే కలిసారో వారంతా కూడా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. దీనితో పలువురు రాజకీయ నాయకులు సహా సినీ ప్రముఖులు కూడా కేటీఆర్ కోలుకోవాలని ఆకాంక్షించారు. మరి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం.

సంబంధిత సమాచారం :