తెలంగాణలో రేపటి నుండి థియేటర్లు ఓపెన్ !

Published on Jun 19, 2021 6:42 pm IST

తెలంగాణలో రేపటి నుంచి థియేటర్లు ఓపెన్‌ కానున్నాయని తెలిసి సినీ ప్రేమికులు తమ సంతోషాన్ని వ్యక్త పరుస్తున్నారు. ఇక పై థియేటర్స్ 100 శాతం ఆక్యుపెన్సీతో నడిపించుకోవచ్చని అనుమతులిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కరోనా సెకెండ్ లాక్ డౌన్ వల్ల సినిమా హాళ్లు మూసివేశారు. ఎలాగూ కేసులు తగ్గడంతో ఓపెన్ చేసేందుకు సర్కార్ అనుమతి ఇవ్వడంతో, థియేటర్స్ ఓనర్స్ ఓపెన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరి థియేటర్స్ ఓపెన్ అయితే సినిమాల జాతరే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సిన సినిమాలు అన్ని రిలీజ్ కానున్నాయి. ఆ లిస్ట్‌లో అంచనాలు ఉన్న సినిమాల విషయానికి వస్తే.. నాగచైతన్య-సాయిపల్లవి ‘లవ్‌ స్టోరీ’. నాని ‘ట‌క్ జ‌గ‌దీష్‌’, రానా ‘విరాటపర్వం’, చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేశ్‌ ‘నారప్ప’. రవితేజ ‘ఖిలాడి’, విష్వక్‌ సేన్‌ ‘పాగల్‌’లతో పాటు ఇంకా మరొకొన్ని చిన్న చిత్రాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :