బ్రేకింగ్ – వచ్చే వారం నుండి థియేటర్లు క్లోజ్ చేస్తారా ?

Published on Apr 10, 2021 11:00 pm IST

కరోనా కేసులు గత కొన్ని రోజులుగా రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. రోజూ వేల సంఖ్యలో కేసులను నమోదు అవుతుండటంతో ప్రజలు కూడా ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి క్లిష్ట పపరిస్థితుల నడుమ రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు 100% ఆక్యుపెన్సీతో నడవడం మంచింది కాదు అని కొంతమంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

అందుకే ప్రభుత్వాలు మరోసారి సినిమా థియేటర్స్ ఆక్యుపెన్సీని 50% కి తీసుకువస్తాయని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వచ్చే వారం నుంచి అసలు థియేటర్లనే మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందన్న చర్చ జరుగుతుంది. ఈ వార్త పై ఇంకా స్పష్టమైన ధృవీకరణ లేనప్పటికీ, ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలాగే థియేటర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి వ్యూహాన్ని అమలు పరుస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :