నాగ చైతన్య ఓటిటి డెబ్యూ పై లేటెస్ట్ అప్డేట్!

Published on Sep 17, 2021 3:09 am IST


అక్కినేని నాగ చైతన్య తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తున్నారు. నాగ చైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ చిత్రం విడుదల కి సిద్దం అవుతోంది. నాగ చైతన్య అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఒక వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఎప్పుడు మొదలవ్వనుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్ లో మొదలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ హార్రర్ నేపథ్యం లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ కి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించనున్నారు. వీటి తో పాటుగా నాగ చైతన్య హిందీ లో లాల్ సింగ్ చడ్డా తో ఈ ఏడాది అలరించనున్నారు.

సంబంధిత సమాచారం :