క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం, రెండు షెడ్యూల్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కాగా తాజాగా రేపటి నుండి సెప్టెంబర్ 13 దాకా వరుసగా పది రోజులు పాటు షూటింగ్ జరుపుకోనుంది ఈ చిత్రం. అయితే రేపు అసెంబ్లీలో కొన్ని రాజకీయ సన్నివేశాలను చిత్రబృందం తెరకెక్కించనుంది.
కాగా, సీనియర్ ఎన్టీఆర్ గారు మొదటి సారి అసెంబ్లీలో అడుగు పెట్టిన సందర్భం తాలూకు సన్నివేశాన్ని. ఆయన సీమ్ గా తీసుకున్న సంచలాత్మకమైన గొప్ప నిర్ణయాలకు సంబంధించిన సన్నివేశాలను రేపటి నుండి అసెంబ్లీలో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
కాగా నవంబర్ కల్లా టాకీ పార్ట్ ని పూర్తి చెయ్యాలని క్రిష్ భావిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ కూడా చాలా బాగా వచ్చాయని సమాచారం. బుర్రా సాయిమాధవ్ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


