
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్న అతికొద్ది మంది ఇండియన్ హీరోల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు ముందువరుసలో ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి. నిజానికి గత కొంత కాలంగా రజినీ సినిమాలు ఆయన స్టార్ డమ్ కు తగట్లు ఆడకపోయినా, రజినీకాంత్ ఫాలోయింగ్ మాత్రం రోజురోజుకి పెరుగుతూనే వస్తోంది. రజనీ సినిమా వస్తోందంటే చాలు.. ఇక ఆ సినిమా హిట్ ప్లాప్ తో పని లేకుండా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. కబాలి విషయంలో కూడా ఇదే జరిగింది.
కాగా సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత చేయబోయే 165వ సినిమా గురించి ‘సన్ పిక్చర్స్’ టీం ట్వీట్ చేస్తూ.. ఈ సినిమాకి సంబందించిన టైటిల్ ని మరియు మోషన్ పోస్టర్ ని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఇక ఈ చిత్రంలో రజని సరసన సీనియర్ హిరోయిన్ సిమ్రాన్ నటిస్తుండగా.. మరోకీలక పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. అలాగే త్రిష ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. యువ సంగీత సంచలనం అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.