మెగాస్టార్ ‘లూసిఫర్’ నుండి లేటెస్ట్ అప్ డేట్ !

Published on Apr 10, 2021 10:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ షూటింగ్ ను మరో రెండు నెలలు పోస్ట్ పోన్ చేయాలని ప్లాన్ చేస్తోన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతూ ఉండటం, అలాగే చిరు ఆచార్య సినిమా రిలీజ్ డేట్ కూడా వెనక్కి వెళ్లడం.. ఇలా మొత్తానికి లూసిఫర్ షూటింగ్ ను వెనక్కి తీసుకువెళ్లాయి. నిజానికి ఈ సినిమా ‘క్యాస్టింగ్’ను ఎప్పుడో ఫైనల్ చేశారు. మార్చి సెకెండ్ వీక్ నుండి షూట్ చేద్దామని మేకర్స్ షెడ్యూల్ వేయడం, ఆ షెడ్యూల్ కి తగ్గట్లు నటీనటులను ఎంపిక చేయడం జరిగిపోయింది.

అయితే ఈ సినిమా షూట్ అనుకోకుండా పోస్ట్ ఫోన్ అయింది. ఇప్పుడు మళ్ళీ పోస్ట్ ఫోన్ అయ్యేలా ఉంది. అయితే దర్శకుడు మోహన్ రాజా ప్రస్తుతం ఈ సినిమా కోసం కొన్ని రిఫరెన్స్ లు తికే పనిలో ఉన్నాడట. ఇక మలయాళంలో మోహన్ లాల్ చేసిన పాత్రలో చిరంజీవి నటిస్తున్నారు. ఈ సినిమాని మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. మరోపక్క ‘ఆచార్య’ సినిమా ఇప్పటికే విడుదలైన తొలి పాట ‘లాహే లాహే’ బాగా క్లిక్ అయింది.

సంబంధిత సమాచారం :