ప్రభాస్ ‘పీరియాడిక్‌’ మూవీ నుండి లేటెస్ట్ అప్ డేట్ !

ప్రభాస్ ‘పీరియాడిక్‌’ మూవీ నుండి లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jan 1, 2019 10:21 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా `జిల్` చిత్రాన్ని తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌ ఓ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్నది. పక్కా ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం 1960 కాలంలో నేపథ్యంలో సాగుతుందట. అయితే ఇటీవలే ప్రభాస్ ఈ సినిమాలో వింటేజ్ కార్లను కొనుగోలు చేసే ధనికుడిగా కనిపించబోతున్నాడని అనేక వార్తలు వచ్చాయి.

కాగా తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ సినిమాలో వింటేజ్ కార్లను కొనుగోలు చేసే ధనికుడు కాదట. కేవలం ఆ కార్లను ఇష్టపడే వ్యక్తిగానే ప్రభాస్ ఈ సినిమాలో కనిపించనున్నాడని అలాగే కథనంలో వింటేజ్ కార్ చాలా ప్రాధాన్యత కూడా ఉంటుందని తెలుస్తోంది.

ఇక మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2019 చివ‌ర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు