రామారావు ఆన్ డ్యూటీ” సెకండ్ సింగిల్ పై లేటెస్ట్ అప్డేట్

Published on May 6, 2022 1:19 am IST


మాస్ మహారాజా రవితేజ హీరోగా, శరత్ మండవ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్ మరియు RT టీమ్ వర్క్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో రజిష విజయన్ మరియు దివ్యాన్ష కౌశిక్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా, నాజర్, పవిత్రా లోకేష్, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన సెకండ్ సింగిల్ పై చిత్ర యూనిట్ లేటెస్ట్ అప్డేట్ ను ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ సొట్టల బుగ్గల్లో సాంగ్ ను మే 7 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం ను జూన్ 17, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :