‘అఖిల్ 4’ టైటిల్ అది కాదట !

Published on Feb 4, 2020 3:00 am IST

అక్కినేని అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తోన్న సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అఖిల్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అయితే ఈ సినిమాకి ఇంతవరకు టైటిల్ ను పెట్టలేదు చిత్రబృందం. ఫిబ్రవరి 4న సాయంత్రం 5 గంటల 15 నిముషాలకు టైటిల్ రివీల్ చేయనున్నామని సినిమా యూనిట్ నిన్న ప్రకటించింది. అయితే ఈ సినిమాకు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే పేరును పరిశీలిస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదట. ఈ సినిమా టైటిల్ తెలుగులోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక లాస్ట్ షెడ్యూల్ లో చిత్రబృందం ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ సాంగ్ తో పాటు అఖిల్ – పూజా హెగ్డేల మధ్య లవ్ సీన్స్ ను కూడా షూట్ చేశారట. లవ్ సీన్స్ లో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య వచ్చే లవ్ సీన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుందట.

ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నారు. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో. అయితే ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి . దాంతో తన తరువాత సినిమాల పై మరింత జాగ్రత్త పడుతున్నాడు అఖిల్.

సంబంధిత సమాచారం :