అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ !

అఖిల్ ‘లెనిన్’ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on May 11, 2026 10:00 AM IST

Lenin

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌ లో చేస్తున్నాడు. కాగా ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఓ స్పెషల్ ఎపిసోడ్ ఉందట. ఈ ఎపిసోడ్ కోసం మురళీ కిషోర్ అబ్బూరి ఓ స్పెషల్ రోల్ ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన షెడ్యూల్ లో ఈ ఎపిసోడ్ కి సంబంధించి కొన్ని సీన్స్ ను ఘాట్ చేశారు. మరో ఈ రోల్ లో ఎవరు నటించారో చూడాలి.

కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – భాగ్య శ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగా వస్తోందని టీమ్ చెబుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు