బాలయ్య “అఖండ” ఇంకా ఇన్ని రోజులే బ్యాలన్స్.!

Published on May 15, 2021 7:06 am IST

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అఖండ”. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ చిత్రంపై ఇటీవలే హీరోయిన్ ప్రగ్యా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

వాటితో పాటుగా ఈ చిత్రం తాలూకా షూట్ పై లేటెస్ట్ అప్డేట్ కూడా ఒకటి బయటకు వచ్చింది. ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోయిన ఈ చిత్రంలో ఇంకా 15 నుంచి 20 రోజులు మేర షూట్ బ్యాలన్స్ ఉందట. అది అయ్యిపోతే ఈ మోస్ట్ ఆవాటేడ్ అఖండ కంప్లీట్ అయ్యినట్టే అని చెప్పాలి. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కు థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకాత్ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :