బాలయ్య – బోయపాటి సినిమా షూట్ ఇక్కడ జరుగుతుందట.!

Published on Mar 26, 2021 3:00 pm IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు కూడా సెట్ చేసుకుంది. అయితే లేటెస్ట్ గా ఈ చిత్రం తాలూకా షూట్ పై అప్డేట్ ఒకటి తెలుస్తుంది. ఆల్ మోస్ట్ ముగింపు దశకు వస్తున్న ఈ చిత్రం తాలూకా షూట్ కర్ణాటక అడవుల్లో జరుగుతుందట.

బోయపాటి కథకు కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని ఇప్పుడు తెలుస్తుంది. ఇంకా ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం టైటిల్ వెల్లడి కాలేదు. ఈ అప్డేట్ కూడా రావాల్సి ఉంది. వచ్చే ఉగాదికి దానిని రివీల్ చేస్తారనే టాక్ ఉంది. మరి అదెప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :