చరణ్, బోయపాటి సినిమా గురించి ఆసక్తికరమైన వార్త !

27th, March 2018 - 10:43:45 AM

బోయపాటి శ్రీను, రామ్ చరణ్ ల సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది. చరణ్ వచ్చే వారం నుండి చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు. ఈ మూవీ బీహార్ బ్యాక్ డ్రాప్లో నడుస్తుంది. చిత్ర యూనిట్ కొన్ని కీలక సన్నివేశాలు బీహార్ లోనే చిత్రీకరించబోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది.

డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. గతంలో చరణ్ తో ఈ నిర్మాత ‘బ్రూస్ లీ’ సినిమాను తీసారు. ఒకప్పటి హీరోయిన్ స్నేహ ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. బోయపాటి తరహా యాక్షన్ ఈ సినిమాలో అధిక మొత్తంలో ఉండబోతోందని సమాచారం. చరణ్ తాజా చిత్రం ‘రంగస్థలం’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ విడుదల తరువాత చరణ్ పూర్తి పోకస్ బోయపాటి సినిమా పై పెట్టబోతున్నాడు.