‘వీరమల్లు’ కొత్త షెడ్యూల్ కి పవన్ రెడీ

‘వీరమల్లు’ కొత్త షెడ్యూల్ కి పవన్ రెడీ

Published on May 22, 2023 11:02 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘హరిహర వీరమల్లు’. అయితే, ఈ సినిమా షూటింగ్ కి ప్రస్తుతం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ఈ నెల 13వ తేదీ నుంచి సారథి స్టూడియోలో స్టార్ట్ కావాలి. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ షెడ్యూల్ పోస్ట్ ఫోన్ అయింది. మరి హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ ఫ్యాన్స్ మెసేజ్ లు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో జూన్ ఫస్ట్ వీక్ నుంచి పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ కోసం డేట్స్ కేటాయించాడు అని తెలుస్తోంది.

జూన్ లో జరగబోయే షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పై ఓ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ యాక్షన్ ఎపిసోడ్ తాలూకు సెటప్ ను మొత్తం రెడీ చేశారు. కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది.

ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరీ ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు