“హరిహర వీరమల్లు” షూట్ పై లేటెస్ట్ బజ్.!

Published on Mar 7, 2023 3:13 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. మరి పవన్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా ఇది కావడం భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తుండడంతో పవన్ కెరీర్ లో ఈ ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకంగా మారింది.

అయితే ఇప్పుడు పవన్ ఈ సినిమా మినహా మిగతా సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉండగా ఈ సినిమా సంగతి ఏంటా అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే లేటెస్ట్ గా సినిమా షూట్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ఏ సినిమాకి అయితే ఇంకా దాదాపు 20 నుంచి 40 రోజుల మేర షూటింగ్ బాలన్స్ ఉందట.

అలాగే వి ఎఫ్ ఎక్స్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది అని అలాగే పవన్ ఎప్పుడు జాయిన్ అవుతారు అనేది ఈ మార్చ్ 14 తర్వాత అయితే క్లారిటీ రానుంది అని పవన్ వర్గాలు చెప్తున్నాయి. మరి పవన్ జాయిన్ అయ్యే దాని బట్టి షూట్ పై అయితే మరింత క్లారిటీ రానుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :