‘వార్ 2’లో హృతిక్ కొత్త లుక్

‘వార్ 2’లో హృతిక్ కొత్త లుక్

Published on Feb 25, 2024 9:18 PM IST

‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. వచ్చే నెల రెండో వారం నుంచి ‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ల పై ఓ ఛేజింగ్ సీక్వెన్స్ ను తీయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సీక్వెన్స్ ఫ్లాష్ బ్యాక్ లో వస్తోంది అని, ఈ సీక్వెన్స్ లో హృతిక్ రోష‌న్‌ రింగుల జుట్టుతో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో చాలా కొత్తగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక వార్ 2 కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. ఏది ఏమైనా ‘వార్ 2’ అనేది యాక్షన్ ఫిల్మ్. మరి యాక్షన్ ఫిల్మ్ లో ఎన్టీఆర్ ఏ రేంజ్ నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు