కంగనా ‘తలైవి’ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Aug 8, 2020 4:12 pm IST

తమిళ ప్రజల ఆరాధ్య ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, బాహుబలితో నేషనల్ రైటర్ అయిపోయిన విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో, టాలెంటెడ్ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో వస్తోన్న బయోపిక్ ‘తలైవి’. అమ్మ బయోపిక్ అనేసరికి మొదటినుండి ఈ సినిమా పై ఆసక్తి ఎక్కువైంది. తాజాగా ఈ సినిమా ఎడిటింగ్ పూర్తి అయిందట. మళ్ళీ కొన్ని సీన్స్ ను రీషూట్ చేయాలట. జయలలిత పాత్రలో బాలీవుడ్ బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్.. ఎం.జి.ఆర్ పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అరవింద స్వామి చేస్తున్నారు. కానీ వీరి మధ్య వచ్చే కొన్ని సీన్స్ సరిగ్గా రాలేదట.

కాగా కరోనా ప్రభావం తగ్గాక ఈ సీన్స్ తోనే షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. మేకర్స్ కి మరో సమస్య కూడా ఉంది. కంగనా రనౌత్ ను అచ్చం అమ్మలా మార్చెందుకు హాలీవుడ్ మూవీ ‘డార్కెస్ట్ హవర్’కి మేకప్ మెన్ గా పనిచేసిన ‘గ్యారీ ఓల్డ్ మెన్, ‘అమ్మ’ బయోపిక్ కోసం ఇండియాకి తీసుకువచ్చారు. ఈ కరోనా సమయంలో ఆయన మళ్ళీ హాలీవుడ్ నుండి ఇండియాకి వచ్చే పరిస్థితి లేదు. దాంతో మేకప్ బ్యాచ్ మొత్తాన్ని మార్చాలి. ఇక జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె బాధను ఆమె భావోద్వేగాలను కంగనా ఎంతవరకు పలికించగలదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More