కంగనా రనౌత్ ‘తలైవి’ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jul 17, 2021 11:08 pm IST

తమిళ ప్రజల ఆరాధ్య ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, బాహుబలితో నేషనల్ రైటర్ అయిపోయిన విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో, టాలెంటెడ్ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో వస్తోన్న బయోపిక్ ‘తలైవి’. కాగా ఈ సినిమాలో కొన్ని సీన్స్ ను మళ్ళీ రీషూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది, మొత్తానికి కంగనా ఈ సినిమా కోసం బాగానే కష్టపడుతుంది. పైగా సినిమాలో మొత్తం ఐదు గెటప్స్ లో కనిపించబోతుందట.

జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. దాంతో కంగనా 18 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ చిత్రంలో కనిపించనుంది. కాగా ఈ చిత్రం హిందీ మరియు తమిళంతో పాటు మిగిలిన భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. పైగా అమ్మ బయోపిక్ కాబట్టి తమిళంలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది.

సంబంధిత సమాచారం :