కంగనా ‘తలైవి’ రిలీజ్ అప్పుడేనా ?

కంగనా ‘తలైవి’ రిలీజ్ అప్పుడేనా ?

Published on Jun 3, 2021 2:12 AM IST

తమిళ ప్రజల ఆరాధ్య ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, బాహుబలితో నేషనల్ రైటర్ అయిపోయిన విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో, టాలెంటెడ్ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో వస్తోన్న బయోపిక్ ‘తలైవి’. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. కరోనా సెకెండ్ వేవ్ తగ్గిన తరువాత ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోన్న క్రమంలో జులై చివరి వారంలో ఈ సినిమాని రిలీజ్ చేస్తారట.

కాగా ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది, మొత్తానికి కంగనా ఈ సినిమా కోసం బాగానే కష్టపడుతుంది. పైగా సినిమాలో మొత్తం ఐదు గెటప్స్ లో కనిపించబోతుందట. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు.

దాంతో కంగనా 18 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ చిత్రంలో కనిపించనుంది. కాగా ఈ చిత్రం హిందీ మరియు తమిళంతో పాటు మిగిలిన భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. పైగా అమ్మ బయోపిక్ కాబట్టి తమిళంలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు