మహేష్ కోసం ట్రై చేసింది కొరటాల ఒక్కడే !

Published on Mar 18, 2020 3:56 pm IST

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న ‘చిరు 152వ’ సినిమా ‘ఆచార్య’లో అతిధి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నారంటూ ఆ మధ్య సోషల్ మీడియాలో చాల విస్తృతంగా వార్తలు వచ్చాయి. దీనికి కారణం దర్శకుడు కొరటాల శివేనట. ఈ సినిమాలోని ఓ యంగ్ క్యారెక్టర్ లో మొదట చరణ్ నటింపచేయాలని అనుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడంతో.. చరణ్ డేట్లు అందుబాటులో ఉండవేమోనని, కొరటాల ఆ యంగ్ రోల్ కోసమని సూపర్ స్టార్ ను అనుకున్నారు. అయితే ఆ తరువాత ఏమైంది ఏమో మహేష్ చేస్తాడని చెప్పిన పాత్రలో చరణే కనిపించబోతున్నట్లు సినీ వర్గాల్లో వినిపించింది. ఈ విషయంలో కొరటాల కాస్త ఇబ్బంది పడ్డారట.

కాగా ఈ చిత్రం కోసం మెగాస్టార్ బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఇప్పటికే మణిశర్మ ఈ చిత్రానికి ట్యూన్లను సిద్ధం చేశారు. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేక మాస్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ లో రెజీనా నటించింది. ఇక ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు హీరో ఎలివేషన్స్ తో కూడుకునే బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది. అన్నిటికంటే ప్రధానమైన సోషల్ ఇష్యూ తప్పకుండా ఉంటుంది.

సంబంధిత సమాచారం :

More