‘లైగర్’ క్లైమాక్స్ పై క్రేజీ అప్ డేట్ !

‘లైగర్’ క్లైమాక్స్ పై క్రేజీ అప్ డేట్ !

Published on Jun 7, 2021 12:44 PM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రాబోతున్న “లైగర్” సినిమా క్లైమాక్స్ పై ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. ఈ క్లైమాక్స్ దాదాపు పదిహేను నిమిషాలు ఉంటుందట. వెరీ ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్ యాక్షన్ తో పాటు ట్విస్ట్ లతో ఆడియన్స్ ను థ్రిల్ చేస్తోందట. ఇక ఈ సినిమా పై అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

ఈ సినిమాలో కీలకమైన యాక్షన్ సీన్ లో రియల్ ఇంటర్ నేషనల్ బాక్సర్ నటించబోతున్నాడట. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన లుక్ తో పాటు హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చాడు. కాగా ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు.

ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు