చైతు ‘లవ్ స్టోరీ’ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదట !

Published on Jun 17, 2021 6:13 pm IST

కరోనా కేసులు తగ్గుతున్నాయి కాబట్టి, ఈ నెల చివరి నుంచి తెలుగు రాష్ట్రాల్లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ అవుతాయని అంటున్నారు. దాంతో అక్కినేని నాగచైతన్య – క్రేజీ బ్యూటీ సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదల విషయంలో మళ్ళీ పుకారు మొదలైంది. జులై ఫస్ట్ వీక్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ క్రమంలో ఈ చిత్ర నిర్మాత సునీల్ నారంగ్ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇస్తూ.. ‘తెలుగు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే రిలీజ్ గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతానికి లవ్ స్టోరీ రిలీజ్ పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అందరూ అంటున్నట్టు, జులై ఫస్ట్ వీక్ లో రిలీజ్ కాకపోవచ్చు. జులై రెండవ వారం తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయి అనిపిస్తుంది. కాబట్టి, ఈ చిత్రం విడుదల తేదీ పై అప్పుడే నిర్ణయం తీసుకుంటాము’ అంటూ చెప్పుకొచ్చారు.

డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. ఇక శేఖర్ కమ్ముల ఈ సినిమాకి దర్శకుడు కావడం మరో ప్రత్యేకత.

సంబంధిత సమాచారం :