“సర్కారు వారి పాట”లో మహేష్ రోల్ మరింత ఆసక్తిగా అట.!

Published on Jul 1, 2021 8:40 pm IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ మాస్ మసాలా డ్రామా పై మహేష్ ఫ్యాన్స్ చాలానే అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే ఓ షెడ్యూల్ ని కూడా మేకర్స్ కంప్లీట్ చేసేసి ఇప్పుడు రెండో షెడ్యూల్ ని రీస్టార్ట్ చెయ్యడానికి సన్నద్ధం అవుతున్నారు.

అయితే ఈ సినిమా కోసం మళ్ళీ మహేష్ సరికొత్త మేకోవర్ లోకి అది కూడా చాలా కాలం తర్వాత చేస్తుండడంతో మరింత ఉత్సుకత నెలకొంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ చిత్రంలో మహేష్ లుక్స్ పరంగానే కాకుండా తన మహేష్ బాడీ లాంగ్వేజ్ కూడా కంప్లీట్ గా కొత్తగా కనిపించనుందట.

దానితో సరికొత్త మహేష్ ను సర్కారు వారి పాట నుంచి విట్నెస్ చెయ్యడం ఖాయం అని తెలుస్తుంది. అలాగే ఇప్పటికే యాక్షన్ ఎపిసోడ్స్ ను కూడా మహేష్ మునుపటి సినిమాలతో పోలిస్తే కంప్లీట్ డిఫరెంట్ గా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసిందే. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సహా 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :