మహేష్ తో త్రివిక్రమ్ ప్లాన్ మారిందా ?

Published on Jul 4, 2021 12:33 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఓ పాన్ ఇండియా సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని ఆగస్టు నుండి షూట్ మొదలుపెట్టాలని, అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తీసుకోవాలని త్రివిక్రమ్ ప్లాన్ చేశాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా షూట్ పోస్ట్ ఫోన్ అయ్యేలా ఉంది. ‘సర్కారు వారి పాట’ పూర్తి అయ్యాకే మహేష్ ఈ సినిమా మీదకు వస్తాడు.

అంటే అక్టోబర్ నాటికీ త్రివిక్రమ్ – మహేష్ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది. అలాగే హీరోయిన్ విషయంలో కూడా త్రివిక్రమ్ వేరే ఆప్షన్ ను వెతికే పనిలో ఉన్నాడట. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను ‘యూకే’లో చిత్రీకరించబోతున్నారట. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ‘శిల్పా శెట్టి’ నటిస్తోంది. సినిమాలో మహేష్ కి ఆమె పిన్నిగా కనిపించబోతుందట.

మొత్తానికి త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్‌ ని పెడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే నదియా, ఖుష్బూ, దేవయాని, టబు, ఇప్పుడు శిల్పా శెట్టి. ఈ సినిమాని హారికా హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతుంది. ఇక పదకుండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :