మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్లో చేస్తున్న అవైటెడ్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు కోసం అందరికీ తెలిసిందే. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ చేశారు. అయితే సినిమా విషయంలో చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్న మేకర్స్ నిన్న సినిమా రిలీజ్ డేట్ లాంచ్ లో ఈ సినిమాకి పైడ్ ప్రీమియర్స్, టికెట్ ధరల హైక్స్ ఉంటాయా అనే దానిపై కూడా మాట్లాడ్డం జరిగింది.
నిర్మాత సాహు గారపాటి ఈ సినిమాకి మన దగ్గర ప్రీమియర్స్ ఉంటాయా లేదా అనేది ఇంకా డిసైడ్ చేయలేదని తెలిపారు. ప్రస్తుతం డిస్కషన్స్ మాత్రమే జరుగుతున్నాయి అని టికెట్ ధరల విషయంలో కూడా కేవలం మూడు రోజుల హైక్స్ మాత్రమే ఉంటున్నాయి అని సో ఆ రకంగా ప్లాన్ చేసి అన్నిటిపై ఒక డెసిషన్ కి వస్తామని తెలిపారు. సో ఈ సినిమాకి ముందే ప్రీమియర్స్ పడే ఛాన్స్ ఉందనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా వెంకీ మామ కూడా కీలక పాత్రలో నటించారు.
