మంచు మనోజ్ నుంచి మరో ఎమోషనల్ డ్రామా !

Published on Feb 15, 2022 5:45 pm IST

మంచు మనోజ్ హీరోగా ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. రాజేంద్ర అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణను‌ కూడా డేట్స్ ఫిక్స్ అయ్యాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఎమోషనల్ డ్రామా అని.. సినిమాలో మంచు మనోజ్ ఒక ‘రా’ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

కాగా మంచు మనోజ్‌ ప్రస్తుతం ‘అహం బ్రహ్మాస్మి’ అనే కొత్త సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తాడు మనోజ్. కాగా ఈ సారి కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. ‘అహం బ్రహ్మాస్మి’ అనే గొప్ప స్లోగన్ ఆధారంగా నడిచే కథతో పవర్ ఫుల్ గా రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా కోసం ‘ఎమ్ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో మంచు మనోజ్ సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు.

సంబంధిత సమాచారం :