రవితేజ సినిమాలో రాజ్ తరుణ్ ?

రవితేజ సినిమాలో రాజ్ తరుణ్ ?

Published on Jan 3, 2022 8:38 PM IST

మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రవితేజ, నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో కూడా ఓ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందట. ఆ పాత్ర ఓ యంగ్ హీరోకి సెట్ అవుతుందని, అందుకే ఆ పాత్రలో యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించబోతున్నాడని తెలుస్తోంది.

అయితే, ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ప్రస్తుతానికి అయితే రాజ్ తరుణ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమాలో రాజ్ తరుణ్ నటిస్తే కెరీర్ కి ప్లస్ అవుతుంది. కాగా ఈ సినిమాలో కామెడీ ఓ రేంజ్ లో ఉంటుందట. ముఖ్యంగా రవితేజ పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. కిక్ సినిమాలోని రవితేజ మళ్ళీ ఈ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తోంది.

ఇక ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల పోస్ట్ ఫోన్ అవుతూ ఎట్టకేలకు స్టార్ట్ అయింది. అన్నట్టు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన ‘క్రాక్’ సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చింది. రవితేజ ఖిలాడి సినిమా కూడా రిలీజ్ రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు