‘డ్రాగన్’ షూటింగ్‌పై లేటెస్ట్ అప్డేట్.. ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడంటే..?

‘డ్రాగన్’ షూటింగ్‌పై లేటెస్ట్ అప్డేట్.. ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడంటే..?

Published on Jul 15, 2026 12:00 AM IST

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ ‘డ్రాగన్’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. కర్ణాటక, హైదరాబాద్ షెడ్యూల్స్ ముగించుకున్న చిత్రబృందం.. ప్రస్తుతం ఎన్టీఆర్, హీరోయిన్ రుక్మిణి వసంత్‌లపై కథలో ఎంతో కీలకమైన నైట్ టైమ్ షెడ్యూల్ సీక్వెన్స్‌లను భారీ స్థాయిలో చిత్రీకరిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామాను 2027 జూన్ లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది లోపే ‘డ్రాగన్’ షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న తారక్.. 2027 నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోయే మైథాలజికల్ డ్రామా ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు