కేజీఎఫ్ డైరెక్టర్ ఎన్టీఆర్ కి కథ చెప్పాడా ?

Published on Aug 10, 2020 12:00 am IST

యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఓ భారీ యాక్షన్ డ్రామా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాని ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. దాదాపు ఈ కాంబినేషన్ ఫిక్స్ అయిపొయింది. కాగా తాజాగా ఆసక్తికరమైన గాసిప్ ఏమిటంటే ఈ సినిమా కథను ప్రశాంత్ ఎన్టీఆర్ కి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఫుల్ కథ చెప్పాడా.. లేక రఫ్ గా స్టోరీ గురించి డిస్కస్ చేశాడా అనేది తెలియదు.

ఇక ఈ సినిమాని పాన్ – ఇండియా స్థాయిలో దాదాపు 200 కోట్ల బడ్జెట్లో నిర్మిస్తారట. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు బల్క్ డేట్స్ కేటాయిస్తున్నారని.. 2022లో సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఇక కేజీఎఫ్ చాప్టర్- 1 ప్ర‌పంచ‌వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల‌ వసూళ్లు సాధించింది. దాంతో ప్రశాంత్ నీల్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. ఏది ఏమైనా ‘కె.జి.ఎఫ్ 2’ను పూర్తి చేసి ప్రశాంత్ తెలుగు సినిమా మొదలుపెట్టనున్నాడు. ఇక కేజీఎఫ్ విషయానికి వస్తే.. ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

సంబంధిత సమాచారం :

More