‘ఎన్టీఆర్ – కొరటాల’ మూవీకి ముహూర్తం ఫిక్స్

Published on Feb 14, 2023 12:55 am IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ఈనెల 23న గ్రాండ్‌గా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మార్చి మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ పోర్టు సెట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఓ యాక్షన్ ఎపిసోడ్ తో షూట్ స్టార్ట్ కానుంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేస్తున్న ఈ యాక్షన్ ఎపిసోడ్, సినిమా మొత్తంలోనే హైలైట్ గా నిలుస్తోందట.

ఇక కథలో అయితే కొంత మైథిలాజికల్ టచ్ కూడా ఉంటుందట. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల కూడా బాగా కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :