పవన్ “వీరమల్లు” పై లేటెస్ట్ అప్డేట్.!

Published on May 29, 2021 1:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ భారీ పాన్ ఇండియన్ చిత్రం “హరిహర వీరమల్లు”. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దాదాపు సగం మేర షూట్ కంప్లీట్ అయ్యిపోయిన ఈ హిస్టారికల్ చిత్రం మళ్ళీ షూట్ ఎప్పుడు పారరం కానుందా అన్న అంశం ఆసక్తిగా మారింది.

మరి ఇపుడు దానిపైనే లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. ఈ చిత్ర నిర్మాత ఏ ఎం రత్నం లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం పవన్ సినిమా కోసం ఆల్రెడీ రెడీగా ఉన్నారని అలాగే ఈ చిత్రంలో నటిస్తున్న పలువురు బాలీవుడ్ స్టార్ నటులు కూడా నెక్స్ట్ జాయిన్ కానున్నారని తెలిసింది. మరి అలాగే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా అంతా సెటిల్ అయ్యాక షూట్ ను స్టార్ట్ చేయనున్నారని ఆయన తెలిపారు. ఇక ఈ భారీ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :