పెద్దగా హిట్స్ లేకపోయినా.. బాగానే డిమాండ్ ఉంది !

Published on Mar 10, 2019 11:12 pm IST

హిట్స్ ఉన్న హీరోయిన్ ఎంత అడిగినా పర్వాలేదు. కానీ పెద్దగా హిట్లు లేని హీరోయిన్ కూడా భారీగా అడిగితే ఏమనుకోవాలి. వచ్చే అవకాశాలు కూడా రావు అనుకోవాలి. కానీ ఇక్కడ హిట్స్ లేని ఈ క్రేజీ హీరోయిన్ భారీ మొత్తంలో అడుగుతూ.. ఆఫర్స్ ను మాత్రం బాగానే అందుకుంటుంది. పైగా మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఇంతకీ అసలు మ్యాటర్ లో వెళ్తే.. ‘ఒక లైలా కోసం’ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే.

ఆ చిత్రంతో పర్వాలేదనిపించింది కానీ పూజ కెరీర్ కు మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు. ఆ తరువాత ‘ముకుంద’లో నటించినా అది పరాజయం అయింది. అయితే ఏం… వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం మహేష్ బాబు ‘మహర్షి’లో నటిస్తోంది. ఈ చిత్రానికి గానూ పూజ కోటి డెబ్బై లక్షల దాకా భారీ పారితోషికాన్నే తీసుకుంది. అలాగే కొత్తగా ఒప్పుకుంటున్న సినిమాలకి కూడా అంతే ఇవ్వాలని ఆర్డర్స్ పాస్ చేస్తుందట. ప్రభాస్ 20వ సినిమాలో నటిస్తుండటంతో పూజా డిమాండ్ కి ప్రొడ్యూసర్స్ ఒప్పుకుంటున్నారట.

సంబంధిత సమాచారం :