హీరో రాజశేఖర్ ఆరోగ్యంపై తాజా అప్డేట్ ఇదే.!

Published on Oct 22, 2020 1:02 pm IST

ఇటీవలే కరోనా వల్ల ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయూ తెలిసిందే. అలాగే అనేక మంది సెలెబ్రెటీలను కూడా కరోనా కబళించింది. అయితే మన టాలీవుడ్ కు చెందిన సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ సహా ఆయన కుటుంబం అంతా కరోనా బారిన పడ్డారని వార్తలు వచ్చాయి.

అలాగే వారి ఇద్దరు కూతుర్లు కరోనా నుంచి బయటపడ్డప్పటికీ రాజశేఖర్ ఆరోగ్యం మాత్రం క్షీణించింది అని తన కూతురు శివాత్మిక రాజశేఖర్ ఎమోషనల్ అయ్యి ఆయన కోలుకోవాలని ప్రార్ధించమని తెలిపింది. అయితే ఇప్పుడు రాజశేఖర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి నుంచి ఆయన ఆరోగ్యం పట్ల బులిటెన్ ను వదిలారు.

ఈ బులెటిన్ ప్రకారం కరోనాతో అడ్మిట్ అయిన ఆయన ప్రస్తుతం ఐసీయూ లో ఉన్నారని అలాగే ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది అని అంతే కాకుండా చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. ఆయన ఆరోగ్యం విషయంలో తాము అన్ని రకాల చికిత్స అందిస్తున్నామని ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు.

సంబంధిత సమాచారం :

More