రాజశేఖర్ హెల్త్ అప్డేట్.. ముఖ్యమైన చికిత్స అందించిన వైద్యులు

రాజశేఖర్ హెల్త్ అప్డేట్.. ముఖ్యమైన చికిత్స అందించిన వైద్యులు

Published on Oct 27, 2020 7:11 PM IST

టాలీవుడు నటీనటులు కొందరు ఇటీవల కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్ సైతం కరోనాకు గురయ్యారు. హైదరాబాద్లోని ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. మొదట్లో ఆయన ఆరోగ్యం మీద అనేక వదంతులు రావడంతో స్పందించిన ఆసుపత్రి వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ స్పష్టమైన సమాచారం ఇస్తున్నారు.

తాజాగా కూడ హెల్త్ అప్డేట్ ఇచ్చిన ఆసుపత్రి వర్గాలు ప్రస్తుతం ఐసీయూలో నాన్‌ ఇన్‌వాసివ్‌ వెంటిలేటర్‌పై అతడికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే చికిత్సలో భాగంగా ఆయనకు ముఖ్యమైన ప్లాస్మా థెరపీని కూడ అందించామని, రాజశేఖర్ చికిత్సకు స్పందిస్తున్నారని, ఆయన కండిషన్ నిలకడగానే ఉందని వెల్లడించారు. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న ఆయన సతీమణి జీవితా రాజశేఖర్ ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా సోకినా ఆయన ఇద్దరు కుమార్తెలు కూడ త్వరగానే కోలుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు