రజినీకాంత్ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Aug 11, 2020 3:00 am IST


సూపర్ స్టార్ రజినీకాంత్ తన తరువాత సినిమాను ‘విశ్వాసం’ ఫేమ్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే నవంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కాకపోతే తక్కువ మంది సభ్యులరో షూట్ చేస్తారట. కాగా రజనీ అభిమానులు, సినీ ప్రేక్షకులు వీరి కాంబినేషన్ పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే హీరోలను ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ శివది ప్రత్యేక శైలి. మాస్, క్లాస్ రెండు వర్గాల చేత విజిల్ వేయించగలిగే ట్రీట్మెంట్ ఇవ్వగలడు. ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలే అందుకు ఉదాహరణ.

కాబట్టే రజనీని శివ ఏ స్థాయిలో చూపుతాడోనని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. అన్నట్టు ఈ సినిమాలో మాజీ బ్యూటీలు ఖుష్బూ, మీనా రజిని సరసన న‌టిస్తోన్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. స‌న్‌పిక్చ‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గోపీచంద్ తో ‘శౌర్యం’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన శివ, తమిళ స్టార్ అజిత్ తో వరుసగా సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నాడు. మరి ఇప్పుడు రజినీతో చేయబోయే సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More