తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన సినిమా షూట్ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చి అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేకపోయినా ఆయన బీపీలో హెచ్చు తగ్గులు సంభవించడంతో అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. దీనితో ఆందోళనలో ఉన్న అభిమానులకు ఆసుపత్రి వారు మాత్రం ఎప్పటికప్పు అప్డేట్ ను అందిస్తున్నారు.
అలాగే తాజాగా ఈరోజు సమాచారాన్ని బులెటిన్ ద్వారా విడుదల చేసారు. ఇక ఇందులో తన ఆయన బీపీ ఇంకా ఎక్కువగానే ఉంది అని దానిని నియంత్రించే పనిలోనే తమ వైద్య సిబ్బంది ఉందని వారు తెలిపారు. అంతే కాకుండా రజినీకు మరిన్ని టెస్టులు చెయ్యాల్సి ఉందని దానికి షెడ్యూల్ కూడా చేశామని తెలిపారు. అలాగే వాటి ఫలితాలను సాయంత్రం వెల్లడి చేస్తామని దాని ఆధారంగానే ఎపుడు డిశ్చార్జ్ ఉంటుంది అన్నది కూడా తెలుపుతామని వారు కన్ఫర్మ్ చేసారు.


