రజినీకాంత్ ఆరోగ్యంపై తాజా సమాచారం.!

రజినీకాంత్ ఆరోగ్యంపై తాజా సమాచారం.!

Published on Dec 26, 2020 8:05 AM IST

rajini
తలైవర్ రజినీకాంత్ ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించడం వల్ల బయటకు వచ్చిన వార్త ఎంతో మందిని కలచివేసింది. ఆయన బ్లడ్ ప్రెజర్ లో హెచ్చు తెగ్గులు ఉండడం వల్ల జరిగింది అని ఆయన అడ్మిట్ అయిన అపోలో ఆసుపత్రి సిబ్బంది వారు తెలిపారు. ఇక ఇదిలా ఉండగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి మరింత సమాచారం వినిపిస్తుంది.

ప్రస్తుతానికి రజినీ ఆరోగ్యం నిలకడగా ఉందని అలాగే ఆయన మరో రెండు రోజుల పాటుగా ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు. అంతే కాకుండా ఈరోజు రజినీకి మరోసారి కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా సమాచారం దీనితో పాటుగా హృదయానికి సంబంధించి టెస్టులు కూడా చేయనున్నారని తెలుస్తుంది.

ప్రస్తుతానికి అయితే రజినీ కుమార్తె సౌందర్య రజినీకాంత్ మాత్రమే ఆయన దగ్గర ఉందని ఏమైనప్పటికీ మాత్రం రజినీ ఖచ్చితంగా రెండు రోజులు అయితే అబ్జర్వేషన్ లో ఉంచి పూర్తిగా కుదుట పడితే డిశ్చార్జ్ చెయ్యడం జరుగుతుంది అని సమాచారం. మరి ఆయన మరింత త్వరగా కోలుకొని బయటకు రావాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు