గేమ్ చేంజర్ లో అదిరిపోయే సాంగ్ ?

Published on Jun 5, 2023 8:01 am IST

క్రేజీ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చిన తర్వాత, రామ్ చరణ్ తేజ్ ఇమేజ్ గ్లోబల్ రేంజ్ కి వెళ్ళింది. అందుకే, శంకర్ కూడా చరణ్ సినిమాని ఆ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నాడు. ముఖ్యంగా చరణ్ పై ఓ భారీ సాంగ్ ను షూట్ చేయబోతున్నాడు. ఈ సాంగ్ లో నేటి నీచమైన రాజకీయ పరిస్థితులను చూసి విసిగిపోయిన ఓ వీడుడు ఏం చేశాడు?, అసలేం చేయాలనుకున్నాడు? అనే కోణంలో సాగే ఈ పాట చాలా బాగుంటుందట.

ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. వెరీ స్టైలిష్ లుక్ లో విభిన్న శైలితో చరణ్, ఈ సినిమాలోనే ప్రధాన హైలైట్‌ గా నిలుస్తాడట. పైగా ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వీటిలో ఒక పాత్రలో గ్రామీణ యువకుడిగా, మరో పాత్రలో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తాడట. చరణ్ లుక్ కోసం బాలీవుడ్ ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ పనిచేస్తున్నాడు. మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో బరువైన ఎమోషన్స్ తో పాటు గ్రాండ్ విజువల్స్ కూడా ఉండబోతున్నాయి.

సంబంధిత సమాచారం :