‘విరాటపర్వం’ పై కొత్త అప్ డేట్ !

Published on Jun 7, 2021 12:00 am IST

రానా – సాయి పల్లవి కలిసి చేస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. దర్శకుడు ‘వేణు ఉడుగుల’ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం ఇప్పటికే చిత్రకరణ పూర్తయింది. ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టింది. జులై నాటికి కరోనా తగ్గితే.. జులైలో ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రానా పాత్ర తర్వాత కథలో ఉన్న శక్తిమంతమైన పాత్రలన్నీ మహిళలవేనట. సాయిపల్లవి, నందితాదాస్‌, ప్రియమణి, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావు ఆ పాత్రలకు మరింత జీవ శక్తినిచ్చారని, ‘విరాటపర్వం’ ఉమెన్‌హుడ్‌ కి ఒక నివాళి అట.

అందుకే ఫ్యామిలీ ప్రేక్షకులు ముఖ్యంగా లేడీస్ సినిమా కాబట్టి, ఈ సినిమాని థియేటర్ లోనే రిలీజ్ చేయాలని ఓటీటీ ఆఫర్లను కూడా కాదు అనుకున్నారు మేకర్స్. కాగా 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా రానున్న ఈ పీరియాడిక్ సోషల్ డ్రామాలో రానా నక్షలైట్ నటిస్తుండగా.. సాయి పల్లవి జానపద గాయనిగా మరియు కొన్ని సన్నివేశాల్లో నక్సలైట్ గా కనిపించనుంది. అయితే ఈ సినిమాలో అప్పటి రాజకీయ అంశాలను కూడా ప్రముఖంగా ప్రస్తావించనున్నారని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :