రవితేజ ద్విపాత్రాభినయం గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Published on Apr 7, 2020 10:07 am IST

మాస్ మహారాజా రవితేజ ఈ మధ్య ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయినప్పటికీ సినిమాల స్పీడ్ ను మాత్రం పెంచుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు రవితేజ. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని మేము ఇంతకు ముందే వెల్లడించాము. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం, రవితేజ్ చేస్తోన్న రెండు పాత్రల్లో ఒక పాత్ర చార్టర్డ్ అకౌంటెంట్ అట, అలాగే మరో పాత్ర ఎన్ఆర్ఐ బిజినెస్ మెన్ పాత్ర అట. బిజినెస్ మెన్ పాత్ర కూల్ గా ఉంటే.. చార్టర్డ్ అకౌంటెంట్ పాత్ర పక్కాగా మాస్ పాత్ర అట.

ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసిన చిత్రబృందం, అలాగే మరో హీరోయిన్ గా మాళవిక శర్మను తీసుకోనున్నారు. గతంలో నేల టిక్కెట్టు సినిమాలో మాళవిక రవితేజ సరసన నటించింది. అయితే ఈ సినిమా రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. తమిళంలో అరవింద స్వామి, త్రిష కలయికలో రానున్న ‘శతురంగ వెట్టై 2’ చిత్రాన్నే తెలుగులో రవితేజ చేయబోతున్నాడని ఆ వార్తల సారాంశం. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

అన్నట్టు ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న ‘క్రాక్’ సినిమా రవితేజకు పూర్వవైభవాన్ని తీసుకొస్తోందట.

సంబంధిత సమాచారం :

X
More