మాస్ మహారాజ్ “ఖిలాడి” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on May 18, 2021 1:19 pm IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఖిలాడి”. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను దర్శకుడు వర్మ తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇటీవలే మేకర్స్ ఈ చిత్రం ఓటిటి రిలీజ్ రూమర్స్ పై చెక్ పెట్టి థియేటర్స్ లోనే విడుదల చేస్తామని కన్ఫర్మ్ చేసారు.

ఇక దీనితో పాటుగా ఈ చిత్రంలో బ్యాలన్స్ షూట్ పై ఇప్పుడు లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో ఇంకా రెండు పాటలు సహా ఒక నెల రోజుల లోపే షూట్ బాకీ ఉందట. ఇవన్నీ అయ్యిపోతే మంచి టైం చూసి థియేటర్స్ లో విడుదల చెయ్యడమే తరువాయి అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :