రవితేజ తదుపరి చిత్రం యొక్క లేటెస్ట్ అప్డేట్ !

రవితేజ తదుపరి చిత్రం యొక్క లేటెస్ట్ అప్డేట్ !

Published on Nov 7, 2018 10:00 AM IST

మాస్ రాజా రవితేజ, విఐ ఆనంద్ దర్శకత్వంలోతన తదుపరి చిత్రంలో నటించనున్నాడని తెలిసిందే. ఈ చిత్రం యొక్క టైటిల్ మరియు లోగో పోస్టర్ ను నవంబర్ 13న లాంచ్ చేయనున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాబా నటేష్ , పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటించనున్నారు. మరో హీరోయిన్ ను ప్రకటించాల్సి వుంది.

ఈచిత్రంలో సునీల్ అలాగే తమిళ నటుడు బాబీ సింహ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ‘నేల టిక్కెట్టు’ నిర్మాత రవి తాళ్లూరి నిర్మించనున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు. డిసెంబర్ నుండి ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక రవితేజ ప్రస్తుతం ఆయన నటించిన ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రం యొక్క ప్రమోషన్స్ లో బిజీ గా వున్నారు. శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈచిత్రం నవంబర్ 16న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ చిత్రం విజయం వీరిద్దరికి చాలా కీలకం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు