“RRR” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

“RRR” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Jul 28, 2021 9:00 PM IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తీస్తున్న “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. మరి ఇప్పుడు అదిరే ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఈ చిత్రం షూట్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

ఈ చిత్రం నుంచి ఆల్రెడీ ఫస్ట్ సింగిల్ అండ్ ప్రమోషనల్ సాంగ్ ని ప్రధాన తారాగణంతో కలిపి షూట్ చేసిన సంగతి తెలిసిందే. మరి అది కాకుండా మరో సాంగ్ షూట్ కి ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయట. అలాగే తారక్ చరణ్ లపై డిజైన్ చేసిన సాంగ్ షూట్ కూడా ఈ నెలతో పూర్తి కానుండగా మరొకటి వచ్చే నెలలో స్టార్ట్ కానున్నట్టు వినికిడి.

మరి భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం నుంచి సాంగ్స్ కోసం మ్యూజిక్ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మొన్ననే భారీ ధరకి రైట్స్ కూడా అమ్ముడుపోయాయి.. ఈరోజు రోర్ ఆఫ్ RRR ఒరిజినల్ సౌండ్ ట్రాక్ కూడా రిలీజ్ అయ్యింది. మరి ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఫుల్ ఆల్బమ్ ని కీరవాణి ఏ స్థాయిలో కంపోజ్ చేసారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు