సరిలేరు నీకెవ్వరూ మూవీ అప్డేట్

సరిలేరు నీకెవ్వరూ మూవీ అప్డేట్

Published on Oct 5, 2019 12:01 AM IST

sarileru1

మహేష్ సరిలేరు నీకెవ్వరూ మూవీ షూటింగ్ కి బ్రేక్ రావడంతో ఆయన పిల్లలతో కలిసి దసరా వెకేషన్ కి వెళ్లారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్ర షూటింగ్ దాదాపు 75శాతం పూర్తి చేశారని సమాచారం. ఇటీవల కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, పోరాటాలు కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్ లో చిత్రీకరించిన చిత్ర యూనిట్ తదుపరి షెడ్యూల్ కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక కేవలం కొన్ని సన్నివేశాలతో పాటు, పాటల చిత్రీకరణ చేయాల్సివుంది.

సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సరిలేరు నీకెవ్వరూ మూవీ టీజర్ ని దీపావళి కానుకగా నవంబర్ లో విడుదల చేసే అవకాశం కలదు. దిల్ రాజ్, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందిస్తున్నారు. ఇక ఈ మూవీతో లేడీ అమితాబ్ విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతుండగా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, బ్రహ్మనందం, సంగీత తదితరులు ఇతర కీలకపాత్రలలో కనిపిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు