“సర్కారు వారి పాట” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Jun 19, 2021 9:00 am IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటి వరకు కేవలం షెడ్యూల్ ని మాత్రమే పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ని స్టార్ట్ చేసిన నాటికే కరోనా రెండో వేవ్ తో ఆ షూట్ ని తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఇప్పుడు దీనిపై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

వచ్చే జూలై నుంచి ఆల్రెడీ ఈ షూట్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ తోనే వచ్చే జూలై మొదటి వారం నుంచే సర్కారు వారి పాట షూట్ ను స్టార్ట్ చేయనున్నారట. అలాగే ఈ షెడ్యూల్ స్టార్ట్ చేసాక అది పూర్తయ్యేవరకు బ్రేక్స్ కూడా ఉండవట. ఏది ఏమైనప్పటికీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఆన్ టైం రిలీజ్ కే ప్లాన్ లో ఉన్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :