క్లైమాక్స్ షూట్ లో నాని ‘శ్యామ్’ !

Published on Jan 17, 2021 9:00 pm IST

నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘శ్యామ్ సింఘ రాయ్’ సినిమా క్లైమాక్స్ ను హైదరాబాద్ లోని అల్యుమినియమ్ ఫ్యాక్టరీలో వేసిన పాతతరం కలకత్తా నేపథ్యం సెట్ లో షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్లైమాక్స్ షూట్ మరో నాలుగు రోజులు పడుతుందని సమాచారం. నిజానికి గతంలోనే ఈ సీక్వెన్స్ షూట్ చేసినా.. కొంత ప్యాచ్ వర్క్ కారణంగా మళ్ళీ రీషూట్ చేస్తున్నారట.

ఇక ఈ క్లైమాక్స్ లో నానితో మిగిలిన నటీనటులు అందరూ పాల్గొనంటున్నారట. కాగా ఈ సినిమా కథ పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. కథ ఫాంటసీ మిక్స్ అయి, ఎమోషనల్ గా సాగే పక్కా ఫిక్షనల్ డ్రామాగా సినిమా వుంటుందట. ఈ సినిమా పై సినిమా జనాల్లో కూడా బాగా ఆసక్తి ఉంది. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం క్రేజీ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. సాయి పల్లవి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో వినూత్నంగా ఉండబోతుందట. నాని మొదటి నుండి ప్రేక్షకులకు కాస్త వైవిధ్యమైన కథలు చెప్పడానికి.. మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు

సంబంధిత సమాచారం :