రాజమౌళి ‘వారణాసి’పై లేటెస్ట్ అప్డేట్!

రాజమౌళి ‘వారణాసి’పై లేటెస్ట్ అప్డేట్!

Published on Mar 18, 2026 10:10 AM IST

Varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా జోనస్ హీరోయిన్ గా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “వారణాసి” కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఆడియెన్స్ నే టార్గెట్ గా చేసుకొని భారీ హంగులతో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా పూర్తవుతున్నాయి.

మెయిన్ గా సినిమా గ్రాండ్ విజువల్స్ పని మరింత వేగంగా పూర్తవుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా షూట్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా తాలూకా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే కీలక టాకీ పార్ట్ జరుగుతుందట. హీరో మహేష్ బాబు, విలన్ పృథ్వీ రాజ్ నడుమ ఇంట్రెస్టింగ్ సీన్స్ ని జక్కన్న తెరకెక్కిస్తున్నారట. మరి ఇవెలా ఉంటాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా కార్తికేయ, కే ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు